Asesha prajalunna e anatha lokamlo yesu kosam అశేష ప్రజలున్న ఈ అనంతలోకంలో యేసుకోసం


Song no:

అశేష ప్రజలున్న ఈ అనంతలోకంలో యేసుకోసం
శ్రమపడే యువకులు కావాలి ప్రభుయేసు కోసం పనిచేసే
యువతులు కావాలి చిరుప్రాయంలో యౌవనకాలంలో
యేసుకోసం శ్రమపడే యువతులు కావాలి
ప్రభుయేసు కోసం పనిచేసే వీరులు రావాలి
ఈలోకం దానిఆశలు గతించున్ ఒకక్షణములో లోకాన్ని
ఆశించి ప్రభువును విడిచి ఉన్మాదులౌతున్నా యువతకోసం !!2!!
ఉజ్జీవంతో పట్టుదలతో !!2!!
దేశంకోసం ప్రార్ధించే యువకులు కావాలి
మన దేశం కోసం ప్రార్ధించే వీరులు కావాలి
నిత్యజీవం పరవశం నమ్మకత్వం ఆనందం !!2!!
యేసులోనే ఉన్నవనిక్రీస్తులోనే సాధ్యమని లోకానికి చాటించుటకు !!2!!
విశ్వాసంతో పవిత్రతో !!2!!
సత్యం కోసం పోరాడే యువకులు కావాలి
సత్యం కోసం పోరాడే వీరుడు రావాలి
أحدث أقدم