Gagana veedhulalo galametthi geethikalu padi గగన వీధిలో గళములెత్తి గీతికలు పాడి


Song no:


గగన వీధిలో గళములెత్తి గీతికలు పాడి
ఘనుడు యేసుని జన్మచాటిరి దూతలు కూడి
ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును
అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడును
నిత్యము మనకతడు తోడుగా నుండును
అనెడి ప్రవక్తల పలుకులు నెరవేరెనిలయనుచు
ఏలయనగా మనకొరకు ఒక శిశువు జనియించును
రాజ్యభారము అతని భుజముల మీదనే యుండును
నీతితో న్యాయముతో అతడు పాలించును
అనెడి ప్రవక్తల పలుకులు నెరవేరెనిలయనుచు

أحدث أقدم