Anudhinamu prabhuni stuthiyinchedhamu anukshanamu అనుదినము ప్రభుని స్తుతియించెదము


Song no:

అనుదినము ప్రభుని
స్తుతియించెదము
అనుక్షణము ప్రభుని
అనంత ప్రేమను "2"
అల్లుకుపోయేది-ఆర్పజాలనిది
అలుపెరుగనిది ప్రభు ప్రేమ "2"
                        "అనుదినము"
1.ప్రతిపాపమును-పరిహరించి
శాశ్వతప్రేమతో-క్షమియించునది
నా అడుగులను-సుస్థిరపరచి
ఉన్నతస్థలమున-నింపునది "2"
అల్లుకుపోయేది-ఆర్పజాలనిది
అలుపెరుగనిది ప్రభు ప్రేమ "2"
                        "అనుదినము"
2.ప్రతిరేపటిలో-తోడైనిలిచి
సిలువనీడలో-బ్రతికించినది
స్వర్గద్వారము-చేరువరకు
మాకు ఆశ్రయమిచ్చునది "2"
అల్లుకుపోయేది-ఆర్పజాలనిది అలుపెరుగనిది ప్రభు ప్రేమ "2"
                        "అనుదినము"
أحدث أقدم