Sajivuda nee rekkalalo సజీవుడా నీ రెక్కలలో నన్ను దాచి కాచి కాపాడావు


Song no: 63
సజీవుడా నీ రెక్కలలో
నన్ను దాచి కాచి కాపాడావు
సర్వోన్నత నీదు ఒడిలో
నన్ను లాలించి ఓదార్చావు

నీ నామమే నాకు ఆశ్రయమాయె
నీ హస్తమే నాకు స్వస్థత నిచ్చె
నీ నామమే నా రక్షణ ఆధారము

నీ వాక్యమే నాకు దీపమాయెను
అనుదినము జీవాహారమాయెను
నీ వాక్యమే నా నిరీక్షణకాధారము

నీ సన్నిధియే నాకు పెన్నిదాయెను
నీ మాటలే నాకు ప్రాణమాయెను
నా ప్రాణము నీవిచ్చిన కృపాదానమే
أحدث أقدم