నిజమైన ద్రాక్షవల్లి నీవె నా యేసయ్యా


Song no: 62
నిజమైన ద్రాక్షవల్లి నీవె
నా యేసయ్యా
నా మంచి వ్యవసాయకుడు
నీవె నా తండ్రి
నీలోన నేను ఫలియించాలని
నీ కొరకు నేను ఇలలో జీవించాలని
ఆశ అయితే నాలో వుందయా

యజమానుడా నా యేసయ్యా

నాలోన నీవు నీలో నా జీవితం
నాయందు నీ మాటలు
ఫలియించునపుడు
అడుగువాటి కంటెను
ఊహించు వాటి కంటెను
అడుగకనె అక్కర తీర్చీతివే

నీవుండు స్థలములో నేనుండులాగున
నా కొరకు స్థలమును సిద్ధపరచితివి
నా కొరకై నీవు రానైయుంటివి
నీ రాజ్యమందు నను చేర్చెదవే
أحدث أقدم