ఉన్నవియైన రాబోవువు వైన నీదు ప్రేమ నుండి ఏది వేరు చేయదు

    Song no: 34
    ఉన్నవియైన రాబోవువు వైన
    నీదు ప్రేమ నుండి ఏది వేరు చేయదు
    లేదులే చేయలేదులే
    నీదు ప్రేమ నుండి
    ఏది వేరు చేయలేదులే

    శ్రమయైన కరువైన ఖడ్గమైనను
    ఆకలి దప్పులు వస్త్రహీనతైనను
    లేదులే చేయలేదులే
    నీదు ప్రేమ నుండి
    ఏది వేరు చేయలేదులే

    దృశ్యమైనను అదృశ్యమైనను
    శక్తులైనను భక్తి హీనులైనను
    లేరులే చేయలేరులే
    నీదు ప్రేమ నుండి
    ఏది వేరు చేయలేదులే

    మరణమైనను జీవమైనను
    ప్రదానులైనను అధికారులైనను
    లేరులే చేయలేరులే
    నీదు ప్రేమనుండి
    ఏది వేరు చేయలేదులే