ఈ ఒంటరి పయాణంలో తోడు నీవే యేసయ్యా


    Song no: 131
    ఈ ఒంటరి పయాణంలో
    తోడు నీవే యేసయ్యా
    ఈ ఒంటరి జీవితంలో
    నీవే నాకు చాలయ్యా
    1. అమ్మా నాన్న లేకున్న
        అమ్మ నాన్న వైనావు
        అప్తులంత దూరమైన
        ఆదారించినావయా
        వెను తిరిగి చూచిన వెంట
        ఎవ్వరు లేరయ్యా
        ముందు తిరిగి చూచిన
        ముందు ఎవ్వరు లేరయ్యా
    2. కృంగియున్న వేళలో
         బలపరచినావయా
        నా తోడు నీవై నడిపించినావయా
        నాలోనే ఉన్నావు
        నాతోనే ఉన్నావు 
        నేనున్నానని చెప్పి
        నను నడుపుచున్నావు
    3. నాకు ఎవరు లేరని
        నే దిగులు చెందగా
        నాచెంతచెరి ధైర్యపరచినావయా
        నా ప్రాణా ప్రియుడా
        నాయేసురాజ నీవు లేనిదే
        నేను బ్రతుకలేనయా