Prabhuva nee melulu ప్రభువా నీ మేలులు నా యెడల విస్తారములు


Song no: 64
ప్రభువా నీ మేలులు
నా యెడల విస్తారములు
లెక్కించి వివరించెద ననుకొంటినా
నాజీవిత కాలం సరిపోదయ్యా

నీ మేలులు తలపోసెదా
నీ మేలులు వివరించెదా

నీ చేతి కార్యములు తలంచగా
ఆశ్చర్యం కలిగెను నాలో తలంచగా
భూమ్యాకాశముల్ నీ చేతి పనులే
సముద్ర జలచరముల్
నీదు కార్యాములే

నీవు నన్ను కలుగజేసిన
విధమును చూడగా
భయము పుట్టెను నాలో ఆశ్చర్యమే
పిండమునై యుండగా
నీ కన్నులు నన్ను చూచెను
నీదు హస్తముతో నను నిర్మించితివే
أحدث أقدم