Song no: 115
పోపోవె ఓ సాతానా - జాగ్రత్త సుమా నీగుట్టు మాకు చిక్కెను - నిన్ను చితుకగొట్టు ఘన సూత్రాలు మాకు - మాతండ్రి నేర్పించి మము స్థిరపరచెను || పోపో ||
ఆదికాలము మొదలుకొని నేటివరకు ఆడితి బహు నేర్పుగా - అద్భుత రీతిగా ఆత్మతండ్రి నీదు - ఆయువుపట్టును అందించెనుమాకు|| పోపో ||
మట్టులేని గొయ్యేగా - నీ కష్టమెల్లా గట్టేక్కేపని లేదుగా సమయము లేదని - సన్నిధి పరులను చెదరగొట్టుట కీవు - కనిపెట్టుచున్నావు|| పోపో ||
కరుణా సముద్రుండైన - త్రిత్వదేవుని - కృప మమ్ము వెంబడించు - ఏదో ఒక సూత్రాన - రక్షించుచుండును భక్షించు నీచేతికి - చిక్కనిచ్చునా మమ్ము|| పోపో ||
إرسال تعليق