Deva thandri neeku dhina dhina sthuthulu దేవా తండ్రీ నీకు దిన దిన స్తుతులు నావిన్నపము విన్న నాధా

Song no: 3

    దేవా తండ్రీ నీకు - దిన దినము స్తుతులు = నావిన్నపము విన్న నాధా సంస్తుతులు

  1. అపవిత్రాత్మల దర్శన - మాపియున్నావు = ఎపుడైన అవి నా - కేసి రానీయవు || దేవా ||

  2. చెడ్డ ఆత్మల మాటల్ - చెవిని బడనీయవు = గడ్డు పలుకుల నోళ్ళు - గట్టియున్నావు || దేవా ||

  3. చెడు తలంపులు పుట్టిం - చెడి దుష్టాత్మలను నా = కడకు రానీయవు - కదలనీయవు || దేవా ||

  4. పాపంబులను దూర - పరచి యున్నావు = పాపంబులను గెల్చు - బలమిచ్చినావు || దేవా ||

  5. పాప ఫలితములెల్ల - పారదోలితివి = శాపసాధనములు - ఆపివేసితివి || దేవా ||

  6. దురిత నైజపు వేరు - పెరికి యున్నావు = పరిశుద్ధ నైజ సం -పద యిచ్చినావు || దేవా ||

  7. ప్రతి వ్యాధినిన్ స్వస్థ - పరచి యున్నావు = మతికి ఆత్మకును నె - మ్మది యిచ్చినావు || దేవా ||

  8. అన్న వస్త్రాదుల - కాధార మీవె = అన్ని చిక్కులలో స - హాయుండ నీవే || దేవా ||

  9. ననుగావ గల దూత - లను నుంచినావు = నిను నమ్ము విశ్వాస - మును నిచ్చినావు || దేవా ||

  10. సైతాను క్రియలకు - సర్వ నాశనము = నీ తలంపులకెల్ల - నెరవేర్పు నిజము || దేవా ||

  11. సాతాను ఆటలిక - సాగనియ్యవు = పాతాళాగ్ని కతని పంపివేసెదవు || దేవా ||

  12. అన్ని ప్రార్థనలు నీ - వాలించి యున్నావు - అన్నిటిలో మహిమ అందుకొన్నావు || దేవా ||

  13. సర్వంబులో నీవు - సర్వమై యున్నావు = నిర్వహించితివి నా - నిఖిల కార్యములు || దేవా ||

  14. హల్లెలుయ హల్లెలుయ - హల్లెలుయ తండ్రీ = కలకాల మున్నట్టి హల్లెలుయ తండ్రీ || దేవా ||

  15. జనక కుమారాత్మ - లను త్రైకుడొందు = ఘనత కీర్తి మహిమ చనువు నాయందు || దేవా ||






raagaM: siMhaeMdriya madhyamamu taaLaM: aaTa



    daevaa taMDree neeku - dina dina stutulu = naavinnapamu vinna naadhaa saMstutulu

  1. apavitraatmala darSana - maapiyunnaavu = epuDaina avi naa - kaesi raaneeyavu || daevaa ||

  2. cheDDa aatmala maaTal^ - chevini baDaneeyavu = gaDDu palukula nOLLu - gaTTiyunnaavu || daevaa ||

  3. cheDu talaMpulu puTTiM - cheDi dushTaatmalanu naa = kaDaku raaneeyavu - kadalaneeyavu || daevaa ||

  4. paapaMbulanu doora - parachi yunnaavu = paapaMbulanu gelchu - balamichchinaavu || daevaa ||

  5. paapa phalitamulella - paaradOlitivi = Saapasaadhanamulu - aapivaesitivi || daevaa ||

  6. durita naijapu vaeru - periki yunnaavu = pariSuddha naija saM -pada yichchinaavu || daevaa ||

  7. prati vyaadhinin^ svastha - parachi yunnaavu = matiki aatmakunu ne - mmadi yichchinaavu || daevaa ||

  8. anna vastraadula - kaadhaara meeve = anni chikkulalO sa - haayuMDa neevae || daevaa ||

  9. nanugaava gala doota - lanu nuMchinaavu = ninu nammu viSvaasa - munu nichchinaavu || daevaa ||

  10. saitaanu kriyalaku - sarva naaSanamu = nee talaMpulakella - neravaerpu nijamu || daevaa ||

  11. saataanu aaTalika - saaganiyyavu = paataaLaagni katani paMpivaesedavu || daevaa ||

  12. anni praarthanalu nee - vaaliMchi yunnaavu - anniTilO mahima aMdukonnaavu || daevaa ||

  13. sarvaMbulO neevu - sarvamai yunnaavu = nirvahiMchitivi naa - nikhila kaaryamulu || daevaa ||

  14. halleluya halleluya - halleluya taMDree = kalakaala munnaTTi halleluya taMDree || daevaa ||

  15. janaka kumaaraatma - lanu traikuDoMdu = ghanata keerti mahima chanuvu naayaMdu || daevaa ||

Blogger ఆధారితం.