Naku chalinadhi nee prema నాకు చాలినది నీ ప్రేమ నన్ను విడువనిది నీ కృప


Song no: 17
నాకు చాలినది నీ ప్రేమ
నన్ను విడువనిది నీ కృప
ఎత్తుకొని ముద్దాడి
భుజముపై నను మోసి
ఎత్తుకొని హత్తుకొని
నీ ఓడిలో చేర్చిన నీ ప్రేమ

1. దూరమైన నన్ను
    చేరదీసె నీ ప్రేమ
    చెరగని నీ ప్రేమతో సేద దీర్చిన
    కంట నీరు పెట్టగా
    కరిగి పొయె నీ హృదయం
    కడలిలోన కడవరకు
    ఆదరించె నీ ప్రేమ

2. పడియున్న నన్ను చూచి
    పరితపించె నీ ప్రేమ
    పరమువీడి భూవికరుదెంచి
    ప్రాణ మిచ్చిన
    ఎంత ప్రేమ యేసయ్య
    ఎంత జాలి నాపైన
    నీ ప్రేమ ఇంత అంతని
    వివరించలేనయా
أحدث أقدم