Nadhu pranamu prabhuni migula నాదు ప్రాణము ప్రభుని మిగుల ఘ నంబు

Song no: 124

రా – హిందుస్థాని తోడి
తా – ఆది

నాదు ప్రాణము ప్రభుని మిగుల ఘ – నంబు చేయుచున్నది = నాదు నాత్మ దేవునం దా – నం మొందెను నిరతము ॥నాదు॥
  1. దేవుఁడు తన భృత్యురాలి – దీనస్థితి లక్షించెను = ఈ వసుంధరఁ దరము లన్నిఁక – నెన్ను నను శుభవతి యని ॥నాదు॥
  2. సర్వ శక్తుఁడు మహాకృత్యము – సంభవింపఁ జేసెను = ఉర్విలో నా ప్రభుని నామం – బోప్పు బరిశుద్ధంబుగా ॥నాదు॥
  3. భయము భక్తియుఁ గల్గి దేవుని – భజనఁ జేసెడి వారికి = నయముగాఁ దన కృప నొసంగు న – నయమును దరతరములు ॥నాదు॥
  4. విదిత బాహువు చేత శార్యము – విభుఁడు కనపర్చెను = హృదయపుఁ దలంపులను గర్వులఁ – జెదరఁ  గొట్టెను నిజముగ ॥నాదు॥
  5. ఆసనాసీనులై యున్న- యతిశయాత్ములన్ బడఁ = ద్రోసి దేవుఁడు దీనులను సిం – హాసనంబుల నునిచెను ॥నాదు॥
  6. క్షుధితులను దన మధురములచేఁ – గోరి తృప్తి పర్చెను = అధిక ధనవంతులను రిక్త – హస్తములతో ననిపెను ॥నాదు॥
  7. ఆది పితరులైన యబ్రా – హాము కతని సంతున = కద్వితీయుఁ డాదిలోక – నాన తిచ్చినట్లుగా ॥నాదు॥
  8. నిరతమును దన కరుణఁ జూప = నిజముగా మది నెంచెను = వరదుఁ డిశ్రాయేలునకుఁ దన – వర సహాయ మొనర్చెను ॥నాదు॥
  9. పరమ తండ్రికి దైవ సుతునకు – పావనాత్మకు నిఁక నిహ = పరము లందును యుగయుగంబులఁ – బరఁగు మహిమ మామేన్ ॥నాదు॥
– భవవాసి సమూయేలు
أحدث أقدم