Sarvonnathuni mahima neepai సర్వోన్నతుని మహిమ నీపై ఉదయించెను నేడు


Song no: 125
సర్వోన్నతుని మహిమ        }
నీపై ఉదయించెను నేడు      }
సర్వలోక రక్షకుడు యేసు    }
నీకై జన్మించెను చూడు        2
ఇక భయమేల ఇక దిగులేల ॥2॥ సర్వోన్నతుని॥
 1
రండి ఆ వెలుగును చూసి తరియించండీ }
రండి మీ రాజును చూసి ఆనందించండి   }2
సాగిలపడి మ్రొక్కుచు సర్వోన్నతుని స్తుతిస్తూ ॥2
సమాధానముతో మీరు సమృద్ధిగ వెళ్ళండి      
॥ఇక భయమేల॥            ॥సర్వోన్నతుని॥
  2
రండి ఆ యేసుని చూడ జనులార       }
రండి ఆ ప్రభువును చూడ మనసారా   }2
సర్వలోక పాపముకై బలియాగ పశువుగ॥2
పశువుల పాకలో శిశువుగ పుట్టినాడు నీకై     

॥ఇక భయమేల॥               ॥సర్వోన్నతుని॥
أحدث أقدم