Parishudduda paramathmuda Lyrics


పరిశుద్ధుడా పరమాత్ముడా
దావీదు చిగురైన యేసు నామధేయుడా
అ.ప: ఐశ్వర్యము జ్ఞానబలము
ఘనతయు మహిమయు నీకే ప్రభూ
1. పరలోకమందున సింహాసనమున
ఆసీనుడైన ఓ దివ్యతేజుడా
సుర్యకాంత పద్మరాగముల పోలియున్నవాడా
గ్రంధమును విప్పగలిగిన సర్వసమర్ధుడా
2. నీ రక్తమిచ్చి దేవుని కొరకు
మమ్మునుకొన్న ఓ జయశీలుడా
రాజులైన యాజకులనుగా చేసియున్నవాడా
మరణించి తిరిగి లేచిన గొప్ప బలాడ్యుడా
3. భూతవర్తమాన భవిష్యత్ కాలమున
జీవించుచున్న ఓ ప్రేమధారుడా
సృష్టియంతా కలుగజేసి ఏలుచున్నవాడా
జీవకోటి పూజలందుకొను సత్యస్వరూపుడా


أحدث أقدم