Nedo repo ani thadavu cheyaku నేడో రేపో అని తడవుచేయకు నేడే ఈనాడే ప్రభు


నేడో రేపో అని తడవుచేయకు
నేడే ఈనాడే ప్రభు యేసుని చేరు
రేపటి దినము
నీది కాదని తెలుసుకో
నేడే ఈనాడే ప్రభు యేసుని చేరు

తినుచు త్రాగుచు సుఖించెదవా
సృష్టికర్తను మరచి నిద్రించెదవా
నీలోన వున్నది తానేనని
తన రూపులో నిను చెక్కెనని
గ్రహియించుమా గమనించుమా
స్తుతియించుమా సోదరా

ఆనందము సంతోషము
నీకు ఇచ్చునని
దుఃఖము నిట్టూర్పులు
ఇక లేనే  లేవని
నీ కొరకై తాను మరణించెను
తన రక్తమే నీకై చిందించెను
గ్రహియించుమా గమనించుమా
స్తుతియించుమా సోదరా
أحدث أقدم