Megamulapaina thirigiranunna Lyrics

మేఘములపైన తిరిగిరానున్న యేసురాకడ ఎంతో దగ్గర
నెరవేరుచుండ ప్రతి సూచన
సిద్ధపడియుంటివా నిద్రవీడకుంటివా
1 తుర్పునపుట్టి పశ్చిమందాక
రెప్పపాటున మెరుపు ఎట్లు ప్రాకునో
దేవుని రాకడ అలాగే ఉండును
జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త విడువబడకుమా
2 దొంగిలించుటకు చప్పుడు చేయక
తెలియకుండా దొంగ ఎట్లు వచ్చునో
మనుష్య కుమారుడు అలాగే వచ్చును
జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త విడువబడకుమా
3 మాటవినకుండ ఓడ బయటుండా
జనులంత జలములెట్లు ముంచెనో
యుగ సమాప్తియు ఆలాగే జరుగును
జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త విడువబడకుమా

أحدث أقدم