Madhura maina ee samayana prabhuni pata padedha మధురమైన ఈ సమయానా ప్రభుని పాట పాడెద

మధురమైన ఈ సమయానా ప్రభుని పాట పాడెద
సుధలు చిందు ఆ నామమును భువిని నేను చాటెద

1. ఎంత ఘోరపాపులనైన మార్చివేయును
ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును
యేసు కరుణ వాక్కులే ప్రేమపూరితం

2. ఎంచలేని దివ్య ప్రేమ యేసు సిల్వ ప్రేమ
ఎంచిచూడ ఏదిలేదు మంచితనము నాలో
యేసు రక్తధారాలే క్షమాసహితము

3. కష్టమైన నష్టమైన క్రీస్తే ఆశ్రయం
హింసయైన బాధయైన లేదు ఏ భయం
యేసు మధురనామమే రక్షణకారకం
أحدث أقدم