Inti meedha nunna ontatri picchukanu nenu ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను

ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను
నా బలమా ఆలకించుమా
నా బలమా ఆదరించుమా
ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేనూ
కన్నీటితో కృంగిపోతున్నాను
నా యేసయ్యా నా బలమా
నాదీన ప్రార్ధన ఆలకించుమా              ॥ఇంటి॥
1
వేటగాని బాణములు చేయుచుండె గాయములు
అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును
నీ బలిపీఠముచెంత నాకు చోటునీయుమా
ఆలకించుమా ఆదరించుమా             ॥ఇంటి॥
2
తెలిసి తెలిసి చేసితినీ ఎన్నెన్నో పాపములు
తరచి తరచి చూచినా తరగవు నా దోషములు
నీ ఆత్మను కోల్పోయిన హీనుడను నేను
ఆలకించుమా ఆదరించుమా              ॥ఇంటి॥


أحدث أقدم