Enthati premanu Lyrics


ఇంతటి ప్రేమను వింతగ చూపను ఎంతటివాడనయా
సంతసమొందుచు జీవితమంతయు స్తోత్రము చేతునయా
అ.ప : కరుణామయా - దయాహృదయా
1. కరగని కఠిన పాషాణం నా హృదయమును గెలిచితివా
తరగని నీదు ప్రేమను చాటను నన్నిల నీవు పిలచితివా
2.ఎండిన మోడు ఈ జీవితం చిగురింపగను చేసితివా
చెరగని నీదు గ్రంధమునందు నా పేరును నీవు రాసితివా


أحدث أقدم