Ee lokam mayara Lyrics


ఈ లోకం మాయరా గతియించే ఛాయరా
పరలోకమే శాశ్వతంరా ప్రభునామమే శరణంరా
స్థిరమైన రాజ్యము కొరకే అన్వేషణ చేయరా
1 అందమైన రంగులతో రకరకాల హంగులతో
నిన్ను ఆకర్షించురా
గురిచూసి ఎర వేసి పాపంలో పడద్రోసి
దైవానికి దూరం చేసేనురా
2 పాపిని పరిశుద్ధపరచి తన సుతునిగా చేయదలచి
యేసు పరమును వీడెరా
ఇలలోని తనవారిని పరలోకం చేర్చాలని
భుమ్యాకాశం మధ్య నిలిచెరా


أحدث أقدم