Avadhulu leni anadham velluvaga అవధులు లేని ఆనందం వెల్లువగా పొంగిన రోజు

Song no: 89
    అవధులు లేని ఆనందం వెల్లువగా పొంగిన రోజు
    ఉరకలు వేసే ఉత్సాహం ఉల్లమునే నింపిన రోజు ||2||
    ఇది నీ పుట్టిన రోజు...
    మనసైన వేడుక రోజు... ||2||
    ||అవధులు||
    "Happy Birth Day To You..."

  1. గడచిన సంవత్సరములు కాచిన దేవుని స్తుతియించాలి
    ఎడబాయక నిన్ను కాపాడిన ప్రభు ప్రేమను మదినుంచాలి ||2||
    ఆయన చేసిన మేలుల బట్టి కృతజ్ఞత చూపించాలి ||2||
    జీవితమంతా ఏసునీ కొరకు సాక్షిగా జీవించాలి... ||2||
    ||అవధులు||
    "Many Greetings To You..."

  2. రాబోయే వత్సరములు కృపయు క్షేమం నీతో రావాలి
    ఈ లాంటి పుట్టిన రోజులు నీవేన్నో చేసుకోవాలి... ||2||
    నీదు జీవితం అనేకులకు దీవెన కరమై సాగాలి ||2||
    నీ గృహమే స్వర్గముగా ధర లో సిరులతో తులతూగాలి... ||2||
    ||అవధులు||
    "May God Bless You, Dear..."

  3. అడుగు పెట్టిన ప్రతి స్థలములలో ఆశీర్వాదం కలగాలి
    మొదలుపెట్టిన పనులన్నిటిలో విజయం తో వెలగాలి ||2||
    ఉన్నతమైన శికరాలెన్నో నీవదిరోహించాలి ||2||
    చదువులు పదవులు వ్యాపారములో వృద్ధి ని సాదించాలి... ||2||
    ||అవధులు||
    "Happy Long Life To You..."
أحدث أقدم