యేసుని నామము ఎంతో మధురము (4)
మధురం మధురం జుంటె తేనెకన్న మధురం (2)
స్తుతి స్తుతి అని కేకలతో
కొనియాడి కీర్తించి
మహా మహిమగల సర్యోన్నతునికి
స్తోత్రము లర్పింతుమ్ 2
1. ప్రభుని ఘన నామమే ఉన్నత నామము
ఉన్నత నామమే శాశ్వత నామము
నిన్న నేడు రేపు ఒకటే రీతిగా నుండే (2)
తండ్రి సుతాత్మ త్రీయేక దేవ నామం (2)
2. ఇమ్మానుయేల్ నామము తోడుండే ప్రియ నామము
తోడుండే ప్రియ నామమే దీవించు శుభనామము
కనుల నీటీని తుడిచి నిన్ను తన దరికి చేర్చి (2)
సత్య వాక్యములో నడిపించే నిత్య నామం (2)
إرسال تعليق