Song no: 18
- యెహోవా నిన్ను పోలియున్నవారెవ్వరు
- సృష్టికి ఆదారుడా అద్వితీయుడా
నిత్యము నివసించుచున్న సత్యదేవుడా "2"
అందరిలో సుందరుడా కాంక్షనీయుడా "2"
వందనముల కర్హుడా పూజ్యనీయుడా "2" ||యెహోవా||
- పాపికొరకు ప్రాణమిడిన ప్రేమ రూపుడా
లోక శాపమును మోసిన సిలువ ధారుడా "2"
మరణపు కోరలు పీకిన విజయవీరుడా "2"
శరణ్ననచో కరుణచూపు పరందాముడా "2" ||యెహోవా||
- ఆదియు అంతములేని అగ్నినేత్రుడా
ఆదరించు నాధుడా స్తుతికి పాత్రుడా "2"
కన్యక కడుపునబుట్టిన పరమపుత్రుడా "2"
అన్యజనుల జతకట్టిన మంచి మిత్రుడా "2" ||యెహోవా||
యేసువా నీకు సాటియైన వారెవ్వరు "2"
إرسال تعليق