Udhayamaye hrudhayama prabhu yesuni ఉదయమాయే హృదయమా ప్రభు యేసుని ప్రార్తించవే

Song no:
HD
    ఉదయమాయె హృదయమా -
    ప్రభు యేసుని ప్రార్తించవే } 2
    పదిలముగా నిను వదలకుండా - పడకనుండి లేపెనే } 2

  1. రాత్రి గడచి పోయెనే -
    రవి తూర్పున ఉదయించేనే } 2
    రాజ రక్షకుడేసు దేవుని -
    మహిమతో వివరించవే } 2 || ఉదయమాయె ||

  2. తొలుత పక్షులు లేచేనే -
    తమ గూటి నుండి స్తుతించేనే } 2
    తండ్రి నీవే దిక్కు మాకని -
    ఆకశమునకు ఎగిరినే } 2 || ఉదయమాయె ||

  3. పరిశుద్దుడా పావనుండా-
    పరంధాముడ చిరంజీవుడా } 2
    పగటి అంతయు గాచి మమ్ము -
    పాలించుము దైవమా } 2 || ఉదయమాయె ||

  4. తండ్రి దాతవు నీవని-
    ధరయందు దిక్కు ఎవరని } 2
    రాక వరకు కరుణజూపి - కనికరించి బ్రోవుమా } 2 || ఉదయమాయె ||

Post a Comment

أحدث أقدم