Neeve nannu korukonnavu lyrics నీవే నన్ను కోరుకొన్నావు - నీవే నన్ను చేరుకొన్నావు

నీవే నన్ను కోరుకొన్నావు - నీవే నన్ను చేరుకొన్నావు
నీవే నన్ను విడిపించావు - నీవే నన్ను విడువనన్నావు
ఎంతప్రేమ యేసయ్యా - వింత ప్రేమ నీదయ్యా - 2 "నీవేనన్ను"
1. నీ అరచేతిలో నన్ను చెక్కుకొన్నావు - నీ కృపలో నన్ను
ఎన్నుకొన్నావు
నీ రాజ్యములో నను దాచివుంచావు - నీ నామములో నను
రక్షించావు
ఎంతప్రేమ యేసయ్యా - వింత ప్రేమ నీదయ్యా - 2 "నీవేనన్ను"
2. నీ వాక్యముతో నను సుద్ధిచేసావు - నీ రక్తముతో నను
కడిగివేసావు
నీ వాగ్ధానముతో నన్ను స్థిరపరచావు - నీ ఆత్మతో నన్ను
నింపివేసావు
ఎంతప్రేమ యేసయ్యా - వింత ప్రేమ నీదయ్యా - 2 "నీవేనన్ను"

Post a Comment

أحدث أقدم