నీతో సమమెవరు? నీలా ప్రేమించేదెవరు ?
నీలా క్షమియించెదెవరు ? యేసయ్యా
నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరూ? "2"
1. వెండి బంగారము ధన ధాన్యాలను - ఒక్కపోగేసిన నీతో సరితూగునా
“2"
జీవనదులన్నియూ సర్వసముద్రములు - ఒక్కటై ఎగసిన నిన్ను
తాకగలవా
నీలా జాలిగల ప్రేమగల దేవుడేరి - నీవేగా మంచి దేవుడవు "2" "
నీతో"
2. పలు వేధాలలోమత గ్రందాలలో - పావనేసుకన్న పరిశుద్ధుడెవరు “2"
పాప పరిహారము సిలువ మరణమొంది - తిరిగి లేచినట్టి దైవ
నరుడెవ్వరు
నీలా పరిశుద్ద దేవుడెవరున్నారయ్యా - నీవేగా విమోచకుడవు "2"
"నీతో"
3. నేను వెదకాకున్నా నాకు దొరికితివి - నే ప్రేమించకున్నా నన్ను
ప్రేమించితివి "2"
నీకు గాయాలుచేసి తరచు రేపితిని - నన్నెంతో సహించి
క్షమియించితివి
లోక సౌఖ్యాలన్నీ ఒక చోట - కుమ్మరించినా - నీవేగా చాలిన దేవుడవు
"2" "నీతో”
إرسال تعليق