Needhanamu neeghanamu prabhu yesudhey lyrics నీధనము నీఘనము ప్రభు యేసుదేనీ దశమాభాగములెల్ల నీయ వెనుదీతువా

నీధనము నీఘనము ప్రభు యేసుదే
నీ దశమాభాగములెల్ల నీయ వెనుదీతువా
1. ధరలోన ధన ధాన్యముల నీయగా - కరుణించి కాపాడి రక్షింపగా
పరలోక నాధుండు నీకీయగా - మరి యేసు కొరకీయ వెనుదీతువా
"నీధన"
2. పాడిపంటలు ప్రభువు నీకియగా - కూడుగుడ్డలు నీకు
దయచేయగా
వేడంగ ప్రభుయేసు నామంబును - గడువేల ప్రభుకీయ ఓ
క్రైస్తవా "నీధన"
3. వెలుగు నీడలు గాలి వర్షంబులు - కలిగించె ప్రభునీకు
ఉచితంబుగా
వెలిగించ ధరయందు ప్రభు నామము - కలిమి కొలది
ప్రభునకర్పించవా "నీధన"
4. కలిగించే సకలంబు సమృద్దిగా - తొలగించె పలుభాధ
భరితంభులు
బలియాయె నీపాపముల కేసుడు - చెలువంగ ప్రభుకీయ
చింతింతువా "నీధన"
5. పరిశుద్ద దేవుని మంధిరమున్ - పరిపూర్ణముగాను
యోచించుడి
పరిశుద్ధ బాగంబు విడదీయుడి - పరమాత్మ దీవెనలను
బొందుడి "నీధన"

Post a Comment

أحدث أقدم