Nadipisthadu naa devudu sramalonaina నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నను విడువడు

Song no:
    నడిపిస్తాడు నా దేవుడు - శ్రమలోనైనా నను విడువడు - 2
    అడుగులు తడబడినా - అలసట పైబడినా - 2
    చేయిపట్టి వెన్నుతట్టి - చక్కని ఆలోచన చెప్పి - 2

  1. అంధకారమే దారి మూసినా - నిందలే నను క్రుంగదీసినా - 2
    తన చిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకూ నను చేర్చుతాడు - 2

  2. కష్టాల కొలిమి కాల్చివేసినా - శోకాలు గుండెను చీల్చివేసినా - 2
    తన చిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకూ నను చేర్చుతాడు - 2

  3. నాకున్న కలిమి కరిగిపోయినా - నా యొక్క బలిమి తరిగిపోయినా- 2
    తన చిత్తం నెరవేర్చుతాడు - గమ్యం వరకూ నను చేర్చుతాడు - 2
أحدث أقدم