ఆశ్రయుడా నా ప్రియుడా
ఆశిత జనపాలకా [2]
నీ శరణం వేడితిని
నను మనిషిగ మార్చిన నా ప్రభువా
‘ఆశ్రయుడా’
1.వేదన యందు వ్యాధులలోనా
ఆదరణ నీవేగ ప్రభువా [2]
క్షామ కాలమున పోషించెదవు
ఉన్నతుడా సర్వోన్నతుడా [2]
‘ఆశ్రయుడా’
2.ఈ లోకములో నను కాపాడుము
నీ నిత్య రాజ్యములో చేర్చు
వాడ బారని జీవకిరీటం
పొందెడి కృప నిమ్ము ప్రభువా
‘ఆశ్రయుడా’
إرسال تعليق