సర్వకృపానిధియగు
1. సర్వకృపానిధియగు ప్రభువా - సకల చరాచర సంతోషమా
స్తోత్రము చేసి స్తుతించెదము - సంతోషముగ నిను పొగడెదము
పల్లవి: హల్లెలూయ హల్లెలూయ - హల్లెలూయ హల్లెలూయా
హల్లెలూయ యని పాడెదను - ఆనందముతో సాగెదను
2. ప్రేమించి నన్ను వెదకితివి - ప్రీతితో నను రక్షించితివి
పరిశుద్దముగ జీవించుటకై - పాపిని నను కరుణించితివి .. హల్లెలూయ..
3. మరణ శరీరము మార్పు నొంది - మహిమ శరీరము పొందుటకై
మహిమాత్మతో నను నింపితివి - మరణ భయములను తీర్చితివి .. హల్లెలూయ..
إرسال تعليق