jayahe jayahe


జయహే.. జయహే.. జయహే.. జయహే..

జయ జయ దేవసుతా జయ జయ విజయసుతా
1. సిలువలో పాపికి విడుదల కలిగెను- విడుదల కలిగెను
కలువరిలో నవ జీవన మొదవెను - జీవన మొదవెను
సిలువ పతాకము జయమును గూర్చెను
జయమని పాడెదను-నా విజయము పాడెదను
నా విజయము పాడెదను
2. మరణపు కోటలో మరణమే సమసెను - మరణమే సమసెను
ధరణిలో జీవిత భయములు దీరెను - భయములు దీరెను
మరణములో సహ జయములు నావే (2) "జయమని"
3. శోదనలో ప్రభుసన్నిది దొరికెను - సన్నిది దొరికెను
వేధనలే రణభూమిగా మారెను భూమిగ మారెను
శోధన భాధలు బలమును గూర్చెను (2) "జయమని"
4. ప్రార్ధనకాలము బహుప్రియమాయెను - బహుప్రియ మాయెను
సార్ధకమాయెను దేవుని వాక్యము - దేవుని వాక్యము
ప్రార్ధనలే భలి పీఠములాయెను (2) "జయమని"
5. పరిశుద్ధాత్ముని ప్రాపక మొదవెను - ప్రాపక మొదవెను
వరుడగు యేసుని వధువుగ మారితి - వధువుగ మారితి
పరిశుద్ధుడు నను సాక్షిగ పిలచెను (2) "జయమని"

Post a Comment

أحدث أقدم