Dhevuni sanniidhilo sampurna santhosham

దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం
ఆ శిలువ నీడలో సంపూర్ణ క్షేమము
నా యేసులో దొరుకునులే నిత్యాజీవము
నా క్రీస్తులో దొరుకునులే నిత్యానందము
1. రాజులను అధికారులను నమ్ముకొనుటకంటే
నా యేసుని నమ్ముటలో నా జీవిత ధన్యకరం
నా యేసు సన్నిధి అదే నాకు పెన్నిధి
తోడుగా నీడగా నను నడిపించునులే
జీవము జీవకీరీటము నా యేసులో దొరుకునులే
2. కునుకడు నిద్రపోడు నా దేవుడు ఎన్నడు
కంటికి రెప్పవలే ననుకాచి కాపాడును
కరువైన కారు చీకటైనా భయమికలేదులే
కరుణించి తన కృప చూపి నను నడిపించును

Post a Comment

أحدث أقدم