స్వార్థము లేనిది నిస్వార్థమైనది
మరణము కంటే బలమైనది ఆ ప్రేమ ||2||
డంభము లేనిది నను ఏడాబాయనిది
లోకం వీడినా నను విడువని ఆ ప్రేమ
నా యేసుని ప్రేమ
నిత్యము నిలిచే ప్రేమా
నను విడువక ఏడబాయనిది
నా క్రీస్తుని ప్రేమ ||2||
ఒకని తల్లి మరచినా మరువనన్న ప్రేమా
కల్వరిలో తన ప్రాణం అర్పించిన ప్రేమ "||2||
నన్ను మారువని ఆ ప్రేమ
ప్రాణం ఇచ్చిన ఆ ప్రేమ
||నా యేసుని ప్రేమ||
తల్లిదండ్రుల ప్రేమలో పక్షపాతముండును
సహోదరుల ప్రేమలో స్వార్థమే ఉండును ||2||
నన్ను ఏడాబాయని ప్రేమ
స్వార్థం లేని నిజ ప్రేమ ||2||
|| నా యేసుని ప్రేమ||
పర్వతాలు తొలగిన తొలగిపోని ప్రేమ
మెట్టలు గతితప్పిన కృప వీడని ప్రేమ ||2||
కృపలో దాచిన ప్రేమ
రెక్కలతో దాచిన ప్రేమ ||2||
||నా యేసుని ప్రేమ"||
إرسال تعليق