Nee numdi veedi ne brathakagalana na margama నీ నుండి వీడి నే బ్రతకగలనా నా మార్గమా నాసత్యమా

నీ నుండి వీడి నే బ్రతకగలనా ||2||
నా మార్గమా నాసత్యమా
నా జీవమా నా సర్వమా

ఆదిలో వాక్కును పలికిన దేవా
ఈ సృష్టిని చేసిన ప్రభువా
నీ కుమారుని పంపినదేవా
మమ్ము రక్షించిన ప్రభువా
నీ ప్రేమ ప్రకటింప నా తరమా
నీ మహిమ గ్రహింప నాకు సాధ్యమా ||నా మార్గమా||

నీ రూపమును ఇచ్చిన దేవా
నాకు ప్రాణం పోసిన దేవా
నన్ను పేరుతో పిలిచిన దేవా
నన్ను దీవించిన ప్రభువా
నువ్వులేక నేనేమి చేయగనైయ్యా
నువ్వు లేక నేనే లేనయ్యా
        ||నా మార్గమా||

Post a Comment

أحدث أقدم