الصفحة الرئيسيةAKK📖 మేలుకొనరే మీ మనంబుల మేలిమిగ మీ మేరఁ దప్పక పాలు మాలక byOnline Lyrics List —سبتمبر 02, 2024 0 41 ప్రాతఃకాల కీర్తన మిక్కిలి.సమూయేలు మ మేలుకొనరే మీ మనంబుల మేలిమిగ మీ మేరఁ దప్పక పాలు మాలక లేచి దేవుని పాదములు పూజింప గ్రక్కున || మేలుకొనరే || దిక్కు లెల్లను దేజరిల్లెను దినకరుండుదయింపనయ్యెను మ్రొక్కులకు ప్రతిఫలము నిచ్చెడు మూల కర్తకుఁ గొలువసేయఁగ || మేలుకొనరే || పక్షులెల్లను గిలకిలంచును బ్రభుని మహిమలు బల్కఁ దొడఁగెను రక్షకుని సకలోపకృతులను రమ్యముగ నుతియించి పాడఁగ || మేలుకొనరే || నిదుర బోయిన వేళ మిమ్మొక నిమిషమైనను బాసియుండక పదిలముగ రక్షించు దేవునిఁ బ్రస్తుతింప మహాముదంబున || మేలుకొనరే || మేటియౌ హృదయాబ్జములలో మీ కృతాజ్ఞతా భూషణంబులు నేటుగా ధరియించుకొని యిటు నిర్మలాత్మునిఁ బూజసేయఁగ || మేలుకొనరే || తెల్లవారఁగఁ దెలియరే యిది తెలివిగల మానవ సమాజము యల్లసిల్లుచు నీతి భాస్కరుఁడుదయ మయ్యెను హృదయముల పై || మేలుకొనరే || maelukonarae mee manMbula maelimiga mee maerAO dhappaka paalu maalaka laechi dhaevuni paadhamulu poojiMpa grakkuna || Melukonare || dhikku lellanu dhaejarillenu dhinakaruMdudhayiMpanayyenu mrokkulaku prathiphlamu nichchedu moola karthakuAO goluvasaeyAOga || Melukonare || pakShulellanu gilakilMchunu brabhuni mahimalu balkAO dhodAOgenu rakShkuni sakaloapakruthulanu ramyamuga nuthiyiMchi paadAOga || Melukonare || nidhura boayina vaeLa mimmoka nimiShmainanu baasiyuMdaka padhilamuga rakShiMchu dhaevuniAO brasthuthiMpa mahaamudhMbuna || Melukonare || maetiyau hrudhayaabjamulaloa mee kruthaajnYthaa bhooShNMbulu naetugaa DhariyiMchukoni yitu nirmalaathmuniAO boojasaeyAOga || Melukonare || thellavaarAOgAO dheliyarae yidhi thelivigala maanava samaajamu yallasilluchu neethi bhaaskaruAOdudhaya mayyenu hrudhayamula pai || Melukonare ||