Unna patuna raleka pothunnanu ఉన్నపాటున రాలేక పోతున్నాను


Song no:


పల్లవి:
ఉన్నపాటున రాలేక పోతున్నాను
కన్న పాపము మొయలేకపోతున్నాను
నేను కన్న పాపము మోయలేక తల్లడిల్లుతున్నాను
తల్లడిల్లుతున్నాను...
రెప్ప పాటున నీ కృప చాలును
నీ రెక్కల చాటున చేరిపోదును
||ఉన్నపాటున||

చరణం:
ఉన్నవారిని కొట్టి లేని వారికి పెట్టి
సమసమాజ నిర్మానమని మానవ రాజ్య స్థాపనని
చీకటిలోకి వెళ్ళిపోయాను
అరణ్య రోదనై మిగిలిపోయాను
అయ్యో నేనెంత దుర్మార్గుడను
అయ్యో నేనంత దౌర్భాగ్యుడను
||ఉన్నపాటున ||

చరణం:
దివినే విడిచిపెట్టి భువికే దిగివచ్చి
దైవ మానవ సమసమాజమని దేవుని రాజ్య స్థాపనని
పాప క్షమకై నీ రక్తము చిందించి
శాప విముక్తికై మృతినే గెలిచితివి
అయ్యా నీవెంత నిజమానవుడవు
అయ్యా నీవంత నిజ దేవుడవు
||ఉన్నపాటున||

أحدث أقدم