Thambhutratho sitharatho natyamutho sthuthinchedhanu తంభురతో సితారతో నాట్యముతో స్తుతియించేదను


Song no:


పల్లవి:
తంభురతో సితారతో నాట్యముతో స్తుతియించేదను ||2||
ఆరాధ్యదైవం నీవేయని నా స్తోత్రగీతం నీదేననీ ||2||
||తంభురతో||

చరణం:
ఉదయమున నే మేల్కొని నీకు స్తోత్రగానము చేసెదను
నీవు చేసిన మేలును తలచి క్రుతాజ్నతాస్తుతులు చెల్లింతును ||2||
శ్రమల గూండా వెళ్లినను చేయి విడువని దేవుడు
వ్యాధి బాదలేనైనా స్వస్థపరచును నా యేసు
ఆత్మతో సత్యము తో ఆరాదించెద నా యేసుని ||2||
||తంభురతో||

చరణం:
పాప ఊభినుండి యేసు నన్ను కరుణతో విడిపించెను
దప్పిగొన్న నాకు యేసు సేదదీర్చి నడిపించెను ||2||
ప్రభువు ప్రేమ నుండి నన్ను విడదీయలేరేవ్వరు
క్రీస్తునందు ఏకమైతిని నేనెలా బయపడుదున్
ఆత్మతో సత్యము తో ఆరాదించెద నా యేసుని ||2||
||తంభురతో||

أحدث أقدم