Nee snehamu yentho sathyamu adhyanthamu నీ స్నేహము ఎంతో సత్యము ఆద్యంతము


నీ  స్నేహము ఎంతో సత్యము  - ఆద్యంతము నా హృదిలో పదిలము
నా సఖుడా - ప్రియ యేసయ్య
నా హితుడా - స్నేహితుడా
నీవెంత గొప్ప వాడివయా  - నను ఆదరించినావయ

1. సింహాల బోనులో నా ప్రాణానికి ప్రాణమైన - నా విభుడవు
చెరసాలలో నా సంకెళ్ళు విరచి విడుదలనిచ్చిన - రక్షకా
కన్నతల్లి కూడా నన్నెరుగక  మునుపే నన్నెరిగిన - నా  తండ్రివీ
నా సఖుడా ||

 2.  గొల్యాతైన, యుద్ధమైన విజయమునిచ్చిన  - వీరుడవూ 
పది వేల మంది నావైపు కూలినా నాతో నిలచిన - ధీరుడవూ
నా దోషములను నీదు రక్తముతో తుడిచివేసిన  - పరిశుద్ధుడవూ
నా సఖుడా ||

3.  ఎన్నిక లేని నను ప్రేమించిన - కృపామయుడవూ 
అందరూ విడిచినా నన్నెన్నడు విడువని - కరుణామయుడవూ
నిస్సారమైన నా జీవితములో  సారము పోసిన -  సజీవుడవూ
నా సఖుడా ||

أحدث أقدم