Manchi devudu yesu devudu మంచి దేవుడు యేసు దేవుడు


Song no:


II మంచి దేవుడు యేసు దేవుడు నా ప్రాణ స్నేహితుడు...
ప్రేమించెనుప్రాణమిచ్చెను స్థితికి నన్ను చేర్చెను...II2II
నాపేద బ్రతుకును మార్చినాడు నన్నెంతో దీవించెనుII2II
లోకానదొరకని తన శ్రేష్ట ప్రేమ నా యెడల కనుపరచినాడుIIమంచిII

1.నా బాధలన్ని తొలగించినాడు నా భారమేమోసినాడు
నాదుఃఖ దినములు సరిచేసినాడు సంతోషమే ఇచ్చినాడు
తనకౌగిట చేర్చుకొని నా కన్నీటినే తుడిచినాడు..
నీతల్లి మరిచినా... నే నిన్ను మరువను అని ఆభయమే ఇచ్చినాడు IIమంచిII

2.నా దీన స్థితిని గమనించినాడు నా గాదనేమార్చినాడు
నేపడిన స్థితిని గుర్తించినాడు తన చేతితో లేపినాడు
నాగాయములన్ని కడిగి-నన్నెంతో ప్రేమించినాడు
తనప్రేమ చాటే గాయకునిగా తన స్వరమునే ఇచ్చినాడుIIమంచిII

3.నా పాప శిక్షను భరియించినాడు-నా పక్షమేనిలిచినాడు
నాకొరతలన్ని తను తీర్చినాడు-నా నింద తొలగించినాడు
నీనడిగిన అన్నివేళలా నా మనవి మన్నించినాడు
నేవెళ్ళు దారిలో నా తోడు నడిచి నన్నెంతో బలపరిచినాడుIIమంచిII

أحدث أقدم