Chachina chethulatho yedhuru chuchuchundenu చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను


చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను
వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగక యుండెను
.. : ఓచిన్నితనయా - నీకిన్నిశ్రమలేలనయా
నీ తండ్రి ప్రేమను గనవా నీ యింటికే తిరిగి రావా

1. పనివారు సయితం నీతండ్రిఇంట
రుచియైున అన్నంతినుచుండగా
కనికరము చూపేవారెవరులేక
శుచిలేనిపొట్టుకైఆశింతువా

2. నీక్షేమమునుకోరునీతండ్రినొదిలి
ఆక్షామదేశమునజీవింతువా
విస్తారఆస్తిపైఅధికారమునువిడిచి
కష్టాలబాటలోపయనింతువా

3. పరిశుద్ధతండ్రికి ప్రియసుతునివైయుండి
పందులతో నీకు సహవాసమా
ఏర్పరచబడినయువరాజువైయుండి
పనికిమాలినవారితోస్నేహమా

أحدث أقدم