adavi vrukshamulo jaldaru అడవి వృక్షములో జల్దరు వృక్షమెట్లున్నదో


అడవి వృక్షములో జల్దరు వృక్షమెట్లున్నదో
పరిశుద్దల మధ్యలో అతి శ్రేష్ఠుడైన ప్రభువి
అ.ప.పాడెదన్ నాదు ప్రియుని జీవికాలమెల్ల
అరణ్య యాత్రలో కృతజ్ఞతతో పాడెదను

నింద దూషణ ఇరుకులలో నను సుగంధముగ
మార్చెన్ నీ కృపలో నన్ను నడిపి నూతన జీవమిచ్చితివే
||పాడెదా||

నా కష్ట తరంగములలో దుఖ సాగరములో యుండగా
నీ కుడి హస్తము చాపి భయపడకని పలికితివే
||పాడెదా||

ఆనంద భరితమైన నేను నీ ప్రేమలో నుండుటకు
నీ స్వరము నాకతి మధురం
-నీ ముఖము మనోహరము ||పాడెదా||

నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించెదన్
నా పరుగును తుదముట్టించి
నీ సన్నిధిలో నుండెదన్ ||పాడెదా||

أحدث أقدم