Yentha goppa manasu needhi yesayya ఎంత గొప్ప మనసు నీది యేసయ్య


Song no:

ఎంత గొప్ప మనసు నీది యేసయ్య
నా కన్నీరు తుడిచినావు యేసయ్య " 2 "

పనికిరాని నన్ను పనికొచ్చేగా మార్చావు
నాపాత జీవితాన్ని పరిశుద్దగా మార్చావు " 2 "
అంత మంచి మనసు నీది యేసయ్య
నాకిన్నాళ్లు తెలియలేదు యేసయ్య " 2 "
                        "  ఎంతగొప్ప  "

నా వ్యాధి బాధ సమయంలో
వైద్యుడుగా నిలిచావు
నాదేహానికి నీవు దేవుడవైయున్నావు " 2 "
అంత గొప్ప మనసు నీది యేసయ్య
నాకు స్వస్థతను ఇచ్చావు యేసయ్య " 2 "
                            "  ఎంతగొప్ప  "

నా బండలాంటి హృదయమును
బలపరచి మార్చావు
నా పాపానికి నీవు ప్రాణమునే పెట్టావు " 2 "
ఎంత జాలి దయా కరుణ నీదయ్యా
నిను ఎన్నాళ్లు విడువనింక యేసయ్య " 2 "
                             "  ఎంతగొప్ప  "
أحدث أقدم