Deva sthothra ganamul pai dhivya sthalamulo దేవస్తోత్ర గానముల్ ఫై దివ్య స్టలములో




Song no: 20


క్రిస్మస్ ప్రవచనముల నెరవేర్పు






    దేవస్తొత్రగానముల్ పై - దివ్యస్థలములో - దేవమారుగానముల్
    భూ - దేశస్థలములో - దేవలోకపావనులను - దీన నరులను
    బోవజూడ భువి దివి క్రిస్మస్



  1. అవ్వకిచ్చినట్టి వాక్కు - అదిగో తొట్టిలో పవ్వళించి యున్న దేవ
    బాలయేసులో = ఇవ్విధముగ సఫలమాయే - ఈదినంబున
    నవ్వుమోము - నరుని కబ్బెను || దేవ ||



  2. షేము దేవ వందనంబు - చెప్పబడియెను భూమి స్తుతుల నందు కొనెడి -
    పూజనీయుడు = భూమిపైన నరుడుగాను - బుట్టవచ్చెను
    భూమి క్రిస్మస్ - బోగమొందెను || దేవ ||



  3. అందరి వంశంబులు నీ - యందుదేవెన - బొందునంచు నబ్రామునకు
    నందెనువాక్కు = అందెక్రీస్తు యూదులకును అన్యజనులకున్
    విందుక్రిస్మస్ - విశ్వమంతటన్ || దేవ ||



  4. షీలో వచ్చువరకు యూదాలో నిలుచుచు - నేలురాజు దండ
    ముండు నెపుడు తొలగదు = నేలమీద నిత్యశాంతి పాలనజేయ
    పాలకుండౌ - బాలుడు - జన్మించెన్ || దేవ ||



  5. అక్షయమగు చుక్కయొకటి - యాకోబులో - లక్షణముగ బుట్ట
    వలయునుధాత్రిపై - రక్షణార్ధులే సదా ని - రీక్షించెడు నక్షత్రం బగు
    రక్షకుడుదయించె || దేవ ||



  6. పుట్టవలయు మోషేవంటి - పూర్ణ ప్రవక్త - ఎట్టివారలైన నెరుగ
    నట్టి ధర్మముల్ - దిట్టముగను స్థాపింప దేవపుత్రుడు - పుట్టెన్
    గొప్ప - బోధకుడాయెను || దేవ ||



  7. మరియ పుత్ర నామ - మిమ్మానుయేలగున్ - నరులకు దేవుండెతోడు
    నిరతమువరకున్ - దరినిదేవుడుండుగాన - వెరవమెన్నడున్
    పరమ దేవుని సహవాసము లభించున్ || దేవ ||



  8. మననిమిత్తమైన శిశువు - మహిని బుట్టెను - చనువుగ దరిజేర
    శిశువు - స్వామియాయెను = తనువు రక్షణను గణింప - వెనుకదేయదు
    వినయభూషణులకు - వేళవచ్చెను || దేవ ||



  9. మొలకలెత్తవలె యెషయి - మొద్దునందున - ఫలములేని మోడు
    నరుల - వంశవృక్షము = విలువగలుగు నిత్యజీవ - ఫలములిడుటకై
    కళగల జన్మార్ధకరుడు వచ్చెను || దేవ ||



  10. కలులు చీకటిన్ నడుచుచు - వెలుగుచూచిరి పలువిధంబులైన యట్టి
    పాపచీకటుల్ = తొలగజేసి శుద్ధకాంతి - కలుగజేయును -
    వెలుగుగా దేవుడు - వెలసె ధాత్రిలో || దేవ ||



  11. అల్పమైన బెత్లెహేము - నందున క్రీస్తు నిల్పవలెను తనదు
    జన్మ - నిజచరిత్రను = అల్పులందు సైతమల్పమైనయూళ్ళలో
    స్వల్పరక్షస్థాపకుడై వచ్చె || దేవ ||



  12. ఆడితప్పనట్టిదేవ - అనంతస్తొత్రముల్ - నాడు పల్కువాగ్ధానముల
    నన్నిటిన్ = నేడు నెరవేర్చినావు నీ సుతునంపి కీడుల్ బాపు క్రిస్మసుగల్గె || దేవ ||



  13. నీ నిజవాగ్ధత్తములను - నిత్యము నమ్మి - వాని నెరవేర్పులు విని - వట్టివి
    యనక = మానసమున ననుభవించు - మనసు - నీయుమని -
    దానమూల్య - జ్ఞానమొసగుమీ || దేవ ||



  14. గగనమందు క్రిస్మసుండు - గానకీర్తులౌ - జగతియందు క్రిస్మసుండు
    స్థవముగల్గుత = యుగయుగములవరకు త్రైకు - డొందు ప్రణుతులు
    సొగసుగ బరిగెడు - చోద్యగీతముల్ || దేవ ||  








  15. దేవస్తోత్ర గానముల్ ఫైదివ్య స్టలములో

    దేవమారు గానముల్ భూదేశ స్టలములో

    దేవలోక పావనులను దీన నరులను –బ్రోవ జూడ భువి దివి క్రిస్మస్

    అవ్వకిచ్చినట్టి వాక్కు అదిగో తొట్టిలో - పవ్వలించియున్న దేవా

    బాలయేసులో – ఇవ్విధముగా సఫలమాయే ఈ దినంబున

    నవ్వ మోము నరునికబ్బెను(దేవ)

    షేముదేవ వందనంబు చెప్పబడియెను -

    భూమి క్రిస్మస్ భోగమొందెను (దేవ)

    అక్షయమగు చుక్కఒకటి యాకోబులో- లక్షణముగ

    బుట్టవలయును ధాత్రిపై - రక్షణార్ధులే సదా నిరీక్షించెడు

    నక్షత్రంబగు రక్షకుడుదయించె





    daevastotragaanamul^ pai - divyasthalamulO - daevamaarugaanamul^
    bhoo - daeSasthalamulO - daevalOkapaavanulanu - deena narulanu
    bOvajooDa bhuvi divi krismas^



  16. avvakichchinaTTi vaakku - adigO toTTilO pavvaLiMchi yunna daeva
    baalayaesulO = ivvidhamuga saphalamaayae - eedinaMbuna
    navvumOmu - naruni kabbenu || daeva ||



  17. shaemu daeva vaMdanaMbu - cheppabaDiyenu bhoomi stutula naMdu koneDi -
    poojaneeyuDu = bhoomipaina naruDugaanu - buTTavachchenu
    bhoomi krismas^ - bOgamoMdenu || daeva ||



  18. aMdari vaMSaMbulu nee - yaMdudaevena - boMdunaMchu nabraamunaku
    naMdenuvaakku = aMdekreestu yoodulakunu anyajanulakun^
    viMdukrismas^ - viSvamaMtaTan^ || daeva ||



  19. sheelO vachchuvaraku yoodaalO niluchuchu - naeluraaju daMDa
    muMDu nepuDu tolagadu = naelameeda nityaSaaMti paalanajaeya
    paalakuMDau - baaluDu - janmiMchen^ || daeva ||



  20. akshayamagu chukkayokaTi - yaakObulO - lakshaNamuga buTTa
    valayunudhaatripai - rakshaNaardhulae sadaa ni - reekshiMcheDu nakshatraM bagu
    rakshakuDudayiMche || daeva ||



  21. puTTavalayu mOshaevaMTi - poorNa pravakta - eTTivaaralaina neruga
    naTTi dharmamul^ - diTTamuganu sthaapiMpa daevaputruDu - puTTen^
    goppa - bOdhakuDaayenu || daeva ||



  22. mariya putra naama - mimmaanuyaelagun^ - narulaku daevuMDetODu
    niratamuvarakun^ - darinidaevuDuMDugaana - veravamennaDun^
    parama daevuni sahavaasamu labhiMchun^ || daeva ||



  23. mananimittamaina SiSuvu - mahini buTTenu - chanuvuga darijaera
    SiSuvu - svaamiyaayenu = tanuvu rakshaNanu gaNiMpa - venukadaeyadu
    vinayabhooshaNulaku - vaeLavachchenu || daeva ||



  24. molakalettavale yeshayi - moddunaMduna - phalamulaeni mODu
    narula - vaMSavRkshamu = viluvagalugu nityajeeva - phalamuliDuTakai
    kaLagala janmaardhakaruDu vachchenu || daeva ||



  25. kalulu cheekaTin^ naDuchuchu - veluguchoochiri paluvidhaMbulaina yaTTi
    paapacheekaTul^ = tolagajaesi SuddhakaaMti - kalugajaeyunu -
    velugugaa daevuDu - velase dhaatrilO || daeva ||



  26. alpamaina betlehaemu - naMduna kreestu nilpavalenu tanadu
    janma - nijacharitranu = alpulaMdu saitamalpamainayooLLalO
    svalparakshasthaapakuDai vachche || daeva ||



  27. aaDitappanaTTidaeva - anaMtastotramul^ - naaDu palkuvaagdhaanamula
    nanniTin^ = naeDu neravaerchinaavu nee sutunaMpi keeDul^ baapu krismasugalge || daeva ||



  28. nee nijavaagdhattamulanu - nityamu nammi - vaani neravaerpulu vini - vaTTivi
    yanaka = maanasamuna nanubhaviMchu - manasu - neeyumani -
    daanamoolya - j~naanamosagumee || daeva ||



  29. gaganamaMdu krismasuMDu - gaanakeertulau - jagatiyaMdu krismasuMDu
    sthavamugalguta = yugayugamulavaraku traiku - DoMdu praNutulu
    sogasuga barigeDu - chOdyageetamul^ || daeva ||






Post a Comment

أحدث أقدم