Prabhuva naa prardhana alakinchuma ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా దేవా నా మొట్ట


Song no:
ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా
దేవా నా మొట్ట నీ సన్నిధికి చేరనీయుమా
ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా
దేవా నా మొట్ట నీ సన్నిధికి చేరనీయుమా


కారుచీకటి వేళలో నా దారి కానక పోయెనే
నమ్మిన ఆ స్నేహమే నన్ను ఒంటరినిగా చేసెనే
కాదననని ప్రేమకై నిన్ను చేరితినయ్యా
కాదననని ప్రేమకై నేనిన్ను చేరితినయ్యా
ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా
దేవా నా మొట్ట నీ సన్నిధికి చేరనీయుమా


మరపురాని నిందలే నా గాయములను రేపెనే
మదిలో నిండిన భయములే నన్ను కృంగదీసెనే
మరువలేని ప్రేమకై నిన్ను చేరితినయ్యా
నన్ను మరువలేని ప్రేమకై
నేనిన్నుచేరితినయ్యా
ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా
దేవా నా మొట్ట నీ సన్నిధికి చేరనీయుమా

నేను చేసిన పాపమే
నాకు శాపమై మిగిలెనే
నాదు దోష కార్యములే
నన్ను నీకు దూరము చేసెనే
నన్ను మన్నించే ప్రేమకై
నిన్ను చేరితినయ్యా
నన్ను మన్నించే ప్రేమకై
నేనిన్ను చేరితినయ్యా
ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా
దేవా నా మొట్ట నీ సన్నిధికి చేరనీయుమా
ప్రభువా నా ప్రార్ధన ఆలకించుమా
దేవా నా మొట్ట నీ సన్నిధికి చేరనీయుమా
أحدث أقدم