Ninnu nenu viduvanu deva neevu nanu నిన్ను నేను విడువను దేవ నీవు నను

Song no: 381

    నిన్ను నేను విడువను దేవ నీవు నను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవ

    నిన్ను నమ్మినవారల నెల్ల నీవు చక్కఁగ దీవించెదవు || నిన్ను నేను ||

  1. నేను శత్రువునై యుండంగ నీవు నాపై నెనరు జూపి దాన మిచ్చితివి నా కొరకు దారుఁడౌ నీ ప్రియ పుత్రుని || నిన్ను నేను ||

  2. త్రోవ దప్పి తిరుగుచుండ దుడుకునైన నన్ను ఁ గాంచి ప్రోవ(గోరి మదిని నీవు త్రోవను బెట్టితివి నన్ను || నిన్ను నేను ||

  3. నాఁటనుండి నేఁటి వరకు నాకుఁ గల్గిన శోధనములలో నేటుగా ననుఁ గాచిన వాఁడవు నీవు గావా, ఓ నా తండ్రి || నిన్ను నేను ||

  4. ఇంత కాలము నన్నుఁ గాచి యిఁకను నన్ను విడువ వనుచు సంత సించి మదిని నేను జక్కఁగ నీ దరి జేరితిని || నిన్ను నేను ||

  5. నీవు గాక యెవరున్నారు నేలపైని ననుఁ గాపాడఁ చేవ లేని నాకు నీవు చేవ గలుగఁ జేయఁ గలవు || నిన్ను నేను ||

  6. అడుగు వారి కిచ్చెద నంచు నాన తిచ్చినావు గాన నడిగెద నిను సాహాయ్యంబు నాత్మమై యున్నట్టి తండ్రి || నిన్ను నేను ||

  7. నాదు ప్రార్థన లన్నియి నీవు నీదు కృపచే నాలకించి నీదు సరణిని నిల్పి నన్ను నేర్పు దనరఁగ రక్షించితివి || నిన్ను నేను ||
أحدث أقدم