Adigina dhani kantenu Lyrics


అడిగినదానికంటెను ఊహించినదానికంటెను
అత్యధిక విజయమిచ్చావు ఆనందము కలిగించావు
.: దేవా వందనం మా ప్రభువా వందనం
1 శక్తిచేత కానేకాదు బలముతోనైతే జరుగదు
ఆత్మద్వారా జరిగించావు మా విశ్వాసము పెంచావు
2 ఆటంకములు ఎదురైనప్పుడు దిగులుతో భయపడినప్పుడు
నిబ్బరముతో నిలబెట్టావు మా తలలను పైకెత్తావు
3 సామర్ధ్యము సరిపోనప్పుడు కొరతతో పని చెడినప్పుడు
వనరులన్నీ సమకూర్చావు మా కోరిక నెరవేర్చావు
4 శత్రుమూక అల్లరి చేసినా పని పాడుచేయచూసినా
చివరకు మము గెలిపించావు మా శ్రమలను మరిపించావు


أحدث أقدم