Yuddha veeruda kadhulu mundhuku lyrics యుద్ధ వీరుడా కదులుముందుకు పాలు తేనెల నగరకు


యుద్ధ వీరుడా కదులుముందుకు పాలు తేనెల నగరకు
వెట్టిచాకిరి పోయె వెనుకకు విడుదలిచ్చెగా రక్తం మనలకు
లేదు మనకిక అపజయం యేసు రక్తమె మన జయం
హల్లెలూయ ! హొసన్న ! (3) మనదే విజయం
హల్లెలూయ ! హొసన్న ! (3) మనదే విజయం

1. ఏదేమైన గాని ఎదురేమున్నా గాని ముందుకే పయనము
ఎర్రసంద్రమైన యెరికో గోడలైన మేం వెనుకడుగు వేయము
యేసుడే సత్య దైవం అంటూ సిలువను చాటుతాం
అడ్డుగా ఉన్న సాతాను కోటలన్నిటి కూల్చుతాం

2. పగలు మేఘ స్తంభం రాత్రి అగ్ని స్తంభమై ప్రభువు తోడుండగా
చింతయే లేదుఏ కొదువ లేదు నిస్సత్తువే రాదుగా
ఆకలి తీర్చి మన్నా కురియును యేసుని నీడలో
దాహము తీర్చ బండయే చీలెను కలువరి సిలువలో

3. గొర్రెపిల్ల రక్తం దివ్య వాక్యం మాకిచ్చెను బహుబలం
శక్తిచేత కాదు బలము చేత కాదు ప్రభు ఆత్మతో గెలిచెదం
యేసుని గొప్ప వాగ్ధానములే నింపెను నిబ్బరం
యేసుని యందు వశ్వాసమె మా విజయపు సూచకం
أحدث أقدم