స్వీకరించుమయా నాథా స్వీకరించుమయా
ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా
స్వంతమేది నాది లేదు నిజాము నా దేవా
నీ దానమైన జీవితమునే నీకు అర్పింతు ||స్వీకరించుమయా||
ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా
స్వంతమేది నాది లేదు నిజాము నా దేవా
నీ దానమైన జీవితమునే నీకు అర్పింతు ||స్వీకరించుమయా||
1) నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు
నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని (2)
జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యము నీవొసగి
ప్రేమ యినెడి భాగ్యమును పంచిపెట్టుమయా
||స్వీకరించుమయా||
నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని (2)
జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యము నీవొసగి
ప్రేమ యినెడి భాగ్యమును పంచిపెట్టుమయా
||స్వీకరించుమయా||
2) సుతుని ద్వారా పితకు నేనిల బలిని అర్పింతు
ఆత్మ దేహములత్యంత అయోగ్యమైనవి (2)
అమరమైన నీ ప్రేమతో నన్ను నింపుమయా
పుణ్య జీవిత భాగ్యమును పంచిపెట్టుమయా
||స్వీకరించుమయా||
ఆత్మ దేహములత్యంత అయోగ్యమైనవి (2)
అమరమైన నీ ప్రేమతో నన్ను నింపుమయా
పుణ్య జీవిత భాగ్యమును పంచిపెట్టుమయా
||స్వీకరించుమయా||
إرسال تعليق