కడవరి దినములలో రావాలి ఉజ్జీవం
యేసుని అడుగులలో నడవాలి యువతరం
భావి భారత పౌరులారా - కదలిరండి ఉత్తేజంతో
క్రీస్తు రాజ్యవారసులారా - తరలిరండి ఉద్వేగంతో
1. క్రీస్తు సిలువను భుజమును మోస్తు - ఆసేతు
హిమాలయం
యేసు పవిత్ర నామం ఇలలో మారు మ్రోగునట్లు
విగ్రహారాధనను భువిపై రూపు మాపే వరకు
భారత దేశం క్రీస్తు రాకకై సిద్దమయ్యే వరకు
కదలి రావాలి యువజనము - కలసి తేవాలి చైతన్యం (2)
భావి భారత పౌరులారా - కదలిరండి ఉత్తేజంతో
క్రీస్తు రాజ్యవారసులారా - తరలిరండి ఉద్వేగంతో
2. కులము, మతము మనిషికి రక్షణ ఇవ్వవని నినదించండి
యేసుక్రీస్తు ప్రభువే ఇలలో లోక రక్షకుడనుచు
మూఢ నమ్మకాలు భువిపై సమసిపోయే వరకు
అనాగరికులు, మతోన్మాదులు - మార్పు చెందేవరకు
కదలి రావాలి యువజనము - కలసి తేవాలి చైతన్యం (2)
భావి భారత పౌరులారా - కదలిరండి ఉత్తేజంతో
క్రీస్తు రాజ్యవారసులారా - తరలిరండి ఉద్వేగంతో
إرسال تعليق