ఓ యేసయ్య ఓ నా బంగారు యేసయ్య
నా యేసయ్య నీకు వేలాది వందనాలు } 2
పాపినైనా నాకొరకు జన్మించినావు ఇలలో
నీ ప్రేమలో నన్ను ఓదార్చి కాపాడినావు } 2
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చుకొందును యేసయ్య } 2 || ఓ యేసయ్య ||
ఈ లోక భాగ్యం నీవే కదా నా తండ్రి
నాకున్న సిరిసంపదలు నీ వరము లే కదా తండ్రి } 2
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చుకొందును యేసయ్య } 2 || ఓ యేసయ్య ||
నీ వేద వాక్యం నాకు వెలుగైనది
నీ సాక్షిగా నేను ఉండేద నేనేసయ్య } 2
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చుకొందును యేసయ్య } 2 || ఓ యేసయ్య ||